దండేపల్లి: వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

17చూసినవారు
దండేపల్లి: వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన దండేపల్లి మండలంలోని గుడిరేవులో జరిగిందని స్థానిక ఎస్ఐ తహిసోద్దీన్ తెలిపారు. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈనెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిందన్నారు. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్