దొనబండ ఎస్సీ బాలుర వార్డెన్ ను తొలగించాలి

77చూసినవారు
దొనబండ ఎస్సీ బాలుర వార్డెన్ ను తొలగించాలి
హాజీపూర్ మండలం దొనబండలోని ఎస్సీ బాలుర హాస్టల్ లో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ ను తొలగించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం హాస్టల్ ఆవరణలో ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని, దసరా సెలవుల సందర్భంగా హాస్టల్ వార్డెన్ సమయానికి రానందున విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.