ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ను జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షుడు కాటంరాజు ఆధ్వర్యంలో సన్మానించారు. హైదరాబాదులో జరిగిన జాతీయ మాల మహానాడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి దక్కడం హర్షణీయమని పేర్కొన్నారు.