మంచిర్యాల పట్టణ శివారులోని గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. మహిళ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రమాదవశాత్తు జారిపడిందా.. ఆత్మహత్య చేసుకున్నదా అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.