తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని దస్నాపూర్ లో శుక్రవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తాళ్లపల్లి రాకేశ్ గౌడ్ అదే గ్రామంలోని వ్యవసాయ భూమిలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా కాలు జారి కింద పడ్డారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ తీసుకెళ్తున్న క్రమంలో పెద్దపల్లి వరకు వెళ్ళేసరికి చనిపోయాడని తెెలిపారు.