తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డితో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.