మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్ కు చెందిన పల్లపు వెంకటేష్ (42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ దివాకర్ ఆదివారం తెలిపారు. వెంకటేష్ కూలీ పని చేసి రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య సుజాత గొడవపడేవాడు. ఈ క్రమంలో భార్యా మందలించడంతో తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.