మంచిర్యాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

58చూసినవారు
మంచిర్యాల: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మంచిర్యాల శివారులోని అంతర్గాం గ్రామ శివారులోని గోదావరినదిలో గల 8వ పిల్లర్ వద్ద (మంచిర్యాల వైపునకు) గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు మంచిర్యాల పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గోదావరిఖని ఏరియా దవాఖానలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతదేహం నీళ్లలో ఉండడంతో గుర్తు పట్టలేకుండా ఉందని, కుడి చేతి పై శ్రీ అని పచ్చబొట్టు ఉన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్