జన్నారం మండలంలోని మహమ్మదాబాదు ప్రధాన రహదారిపై గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, ప్రధాన రహదారికి రోడ్డుకు ఇరువైపులా చెత్తను పడవేయకూడదని సూచించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిర్దిష్ట స్థలాల్లోని చేతకుండీలలో మాత్రమే చెత్తను వేయాలని సూచించారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.