సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల వాటాలో కార్మికులకు 33% వాటా ఇవ్వాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నస్పూర్ మున్సిపాలిటీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు విజిత్ కుమార్ పాల్గొని మాట్లాడారు. కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కార్మికుల పక్షాన మాట్లాడడం లేదని ఆరోపించారు.