రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు పోటీ చేయడానికి ముందుకు రావాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు విజయ కోరారు. జన్నారంలో ఆమె మాట్లాడుతూ, మహిళలకు ప్రభుత్వం 50% సీట్లను కేటాయించాలని తెలిపారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసే శక్తి మహిళలకు ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మహిళలకు కేటాయించాలని కోరారు.