మంచిర్యాల: మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలి.. కలెక్టర్
పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల భవిష్యత్ పై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్ లోని కలెక్టర్ కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణ పై పోలీస్ అధికారులతో, ఆబ్కారి శాఖ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.