సంతానం కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం బాసరలో వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం. ధర్మాబాద్లోని బాజేగావ్ కు చెందిన గోవింద్ (38)కు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. 10 ఏళ్లుగా భైంసాలోని ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడు. ఇప్పటికీ సంతానం కలగక పోవడంతో మనస్తాపం చెంది బాసర రైల్వే స్టేషన్ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.