భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన బొగ్గుల సునీత (35) వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సునీత పక్కింటి వారితో గొడవపడగా గల్లీలో అందరి ముందు బూతులు తిడుతూ పరువుతిసినందుకు మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు