రైతులను మోసం చేసి పంట డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన సీ.ఈ.వో శ్రీనివాస్ ను పట్టుకున్నట్టు ఏ.ఎస్.పి అవినాష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం బైంసా పట్టణ ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలు వెల్లడించారు. కుభీర్ మండలంలో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులతో ఉడాయించి మోసం చేసిన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈవో శ్రీనివాస్ ను ఎట్టకేలకు అరెస్టు చేశామన్నారు.