బాసర గోదావరిలో ప్రమాదవశాత్తూ కాలు జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందిన అధారత్ అమ్మవారి దర్శనానికి వచ్చి మంగళవారం రాత్రి స్నానం చేస్తుండగా గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, గజ ఈతగాళ్లు గోదావరి ఘాట్ కు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.