లోకేశ్వరం: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

81చూసినవారు
లోకేశ్వరం: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. గురువారం ఎస్ఐ అశోక్ వివరాల ప్రకారం గుడిసెరా గ్రామానికి చెందిన దండేకర్ ఆనందరావు బుధవారం పని నిమిత్తం బైక్ పై నందిపేట్ వెళ్లి తిరిగి వస్తుండగా పంచగుడి గ్రామం వద్ద రోడ్డుపై అరబోసిన ధాన్యం కుప్పలను ఢీకొని కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. భార్య చంద్రకళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్