భైంసాలోని గాంధీ గంజ్ ప్రాంతం నుంచి బస్టాండ్ వెళ్లే మార్గంలోని చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. బోలెరోలో అక్రమంగా తరలిస్తుండగా 25 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.