తొలకరి పలకరించడంతో రైతులు వ్యవసాయ పనులలో బిజీ అయ్యారు. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పొలానికి వెళ్లి అక్కడ ఆనందంగా గడుపుతున్నారు. అయితే చిన్న పిల్లలు చేసిన ఓ పనికి పెద్దవాళ్ల ప్రాణం మీదికి వచ్చింది. పిల్లలు ఆడుకుంటున్న బాల్ తేనెటీగలకు తగలడంతో తేనెటీగలు పొలంలో పని చేస్తున్న రైతులపై దాడి చేశాయి ఇందులో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తానూర్ లోని ఝరి తండాలో చోటుచేసుకుంది.