నిర్మల్ లో నేల కూలిన వందేళ్ళ రావి చెట్టు

78చూసినవారు
నిర్మల్ లోని ప్రసిద్ధ రథాల గుడి ఆలయంలో వందేళ్లపై చరిత్ర గల రావిచెట్టు నేల కూలింది. దీంతో ఆలయంలోని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఈ చెట్టు నేలకూలడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య ప్రమాదకర సెల్ టవర్లు, కాలం చెల్లిన చెట్లు ఉంటే వెంటనే తీసివేయాలని వారు కోరారు. రాత్రంతా ఈదురు గాలులు భారీ వర్షంతో భీతిల్లి పోయారు.

సంబంధిత పోస్ట్