పురుగుల మందు తాగి బాలుడు మృతి

61చూసినవారు
పురుగుల మందు తాగి బాలుడు మృతి
పురుగుల మందు తాగి బాలుడు మృతి చెందిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్ వివరాల ప్రకారం ఎంగ్లాపూర్ కు చెందిన చిన్న రెడ్డి (11) కడెంలోని ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఇటీవలే అనారోగ్యం కారణంగా ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించారు. తిరిగి పాఠశాలకు వెళ్లమనడంతో గత నెల 30న పురుగుమందు తాగాడు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్