దిలావర్పూర్: గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన మంగళవారం దిలావర్పూర్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు నిర్మల్ బైంసా జాతీయ రహదారి సిర్గాపూర్ వద్ద భైంసా వైపు నుండి బైక్ పై వస్తున్న ఇద్దరు మేస్త్రీలను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.