మావల: పన్నెండేళ్ల బాలికపై ఏడాదిగా లైంగిక దాడి

119చూసినవారు
మావల: పన్నెండేళ్ల బాలికపై ఏడాదిగా లైంగిక దాడి
మావల పీఎస్ పరిధిలోని ఓ కాలనీలో నివసించే 12ఏళ్ల బాలికపై 55 ఏళ్ల బాలెరావు మనోహర్ ఏడాదిగా లైంగిక దాడులు జరిపాడు. చాక్లెట్లు తదితరాల ఆశ చూపి లొంగదీసుకుని బెదిరిస్తూ వరుసగా అత్యాచారం చేశాడు. చివరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్