నిర్మల్: ఇంటిపై కప్పు నుంచి నేల కూలిన సెల్ టవర్

50చూసినవారు
నిర్మల్ పట్టణంలోని బ్రాహ్మణపురిలో ఇంటి పై కప్పు పై ఉన్న సెల్ టవర్ నేల కూలింది. సోమవారం రాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో టవర్ నేల కూలింది. పైకప్పు పైనుండి నేరుగా ఇంటి గోడలకు అనుకొని టవర్ కూలడంతో ఎలాంటి భారీ నష్టం జరగలేదు. ఇంటి గోడలు పైకప్పు భాగాలు బీటలు వారి నేల కూలాయి. సంఘటన స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ లు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్