నిర్మల్: ఘోర రోడ్డు ప్రమాదం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి)మండల కేంద్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నిర్మల్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 108 లో తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.