నిర్మల్: బస్సు లారీ ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ మృతి
బస్సు-లారీ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ మృతి చెందాడు. నర్సాపూర్ (జి)మండలం తురాటీ వద్ద బస్సు లారీ ప్రమాదవశాత్తు శనివారం సాయంత్రం ఢీకొన్నాయి. ఇందులో లారీ డ్రైవర్ గజ్జల శ్రీను ( 56) తీవ్ర గాయాలపాలు కాగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన వాడిగా గుర్తించారు.