బాలిక కిడ్నాప్, అత్యాచార కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఎస్పీ జానకి షర్మిల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ కు చెందిన నేరస్థుడు షేక్ సమీర్ దిలావర్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పునిచ్చారు.