కాగజ్‌నగర్ మండలం ధరిగాం పారెస్ట్ చెక్ పోస్ట్ కెనాల్ దగ్గర బట్టుపల్లి గ్రామం ఉపాధి హామీ కూలీలను ఎఫ్బీఓ రవి ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురిచేశారని కాగజ్‌నగర్ ఎంపీడీఓ తెలిపారు. ఆడవాళ్లని కూడా చూడకుండా బూతులు తిడుతూ దౌర్జన్యంగా వ్యవహరించి బైక్ తాళాలు లాక్కున్నారన్నారు. బాధిత కూలీలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.