సిర్పూర్ (టి) మండల కేంద్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం రాత్రి చిలువేరు నాన్నయ్యకు చెందిన పెంకుటిల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.