కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 49ను వెంటనే విరమించుకోవాలని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్‌నగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని రైతులు, గిరిజనులను జీవో నెం. 49తో తీవ్రంగా అన్యాయం జరుగుతుందని, దాన్ని వెంటనే రద్దు చేయాలనీ పేర్కొన్నారు.