సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగుతున్న కోనప్ప ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి స్వతంత్రంగా ఉన్నారు. నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అసంతృప్తితో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేటీఆర్‌తో భేటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఆయన మళ్లీ గులాబీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.