సిర్పూర్(టి) మండలం లోనవెల్లి మాజీ ఎంపీటీసీ కె. తుకారాం గురువారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వీరితో మాజీ సర్పంచ్ కీజర్ హుస్సేన్, తదితరులు ఉన్నారు.