సిర్పూర్: ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

68చూసినవారు
సిర్పూర్: ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆటో బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయిన ఘటన కాగజ్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి స్తానిక రైల్వే ఓవర్ పైన ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరు అటవీశాఖలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. క్షతగాత్రులను స్తానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఒకరిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించినట్లు స్తానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్