కాగజ్‌నగర్‌: పులి దాడిలో మహిళ మృతి

73చూసినవారు
కాగజ్‌నగర్‌ మండలం గన్నారం-బెంగాలీ క్యాంప్ 12 నెంబర్ విలేజ్ లో పత్తి ఏరుతున్న మహిళపై శుక్రవారం ఉదయం పెద్దపులి దాడి చేసింది. మహిళను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. అయితే ఆమె మృతదేహంతో కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్