ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని TPCC చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. 'జల్ జంగల్ జమీన్' నినాదానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. గిరిజన, ఆదివాసీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే దేశానికి రోడ్‌మోడల్ అని కొనియాడారు. అన్ని పథకాలను అమలు చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు.