జులై 15 వరకు టీచర్ల సర్దుబాటు: విద్యాశాఖ

78చూసినవారు
జులై 15 వరకు టీచర్ల సర్దుబాటు: విద్యాశాఖ
TG: రాష్ట్రంలోని టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. వచ్చే నెల 15నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13 నాటికి సర్దుబాటు పూర్తి చేయాలని తొలుత ఆదేశించగా.. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఎలా అని టీచర్ల సంఘాల నుంచి ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జులై 22 వరకు సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలు పంపిచాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్