యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌‌లో నత్తనడకన సాగుతున్న ఆడ్మిషన్లు

77చూసినవారు
యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌‌లో నత్తనడకన సాగుతున్న ఆడ్మిషన్లు
TG: యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ (వైఐపీఎస్‌)లో అడ్మిషన్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ స్కూల్లో ఫీజులు భారీగా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రూ.1 లక్ష నుంచి 1.6 లక్షల వరకు ఫీజులు వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2009 జీవో 91 ప్రకారం అడ్మిషన్ ఫీజు రూ.5,000 మించరాదు. దీంతో ఫీజుల తగ్గింపుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్