పంజాబ్ అమృత్‌సర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 21కి పెరిగింది. సోమవారం రాత్రి మజితా ప్రాంతంలో కొందరు కల్తీ మద్యం సేవించారు. మొదట వారిలో 14 మంది చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై సీఎం భగవంత్ సింగ్ మాన్ సీరియస్ అయ్యారు. ఇవి మరణాలు కాదని హత్యలు అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.