నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

81చూసినవారు
నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు
నీట్‌-యూజీ 2024 ప్రశ్నాపత్రం లీకైయిన మాట వాస్తవమేనని.. కానీ, లీకేజీ ప్రభావం పెద్దగా లేదని నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేర్కొంది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పాట్నా సెంటర్‌లలో, గోద్రాలో కొందరి ద్వారా మాత్రమే నీట్‌ పేపర్‌ లీకైందని తెలిపింది. ఈ వ్యవహారం దేశం మొత్తం మీద పరీక్ష నిర్వహణ, ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని పేర్కొంది. కాగా, రేపు నీట్‌ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్