తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. వాటికి సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించడంతో ఎమ్మెల్యేలు కౌంటర్ అఫిడవిట్స్ దాఖలు చేశారు. తాము పార్టీ మారలేదని.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారని సమాచారం. మీడియా దాన్ని వక్రీకరించి మేము పార్టీ మారినట్టుగా చూపించిందని సుప్రీంలో ఒక్కొక్కరిగా అఫిడవిట్ దాఖలు చేశారని తెలుస్తోంది.