25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్‌ దౌత్యవేత్త

54చూసినవారు
25 కేజీల బంగారంతో పట్టుబడ్డ అఫ్గాన్‌ దౌత్యవేత్త
ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ భారత్‌లోని అఫ్గానిస్థాన్‌ సీనియర్‌ దౌత్యవేత్త జకియా వార్ధక్‌ ఇటీవల డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు పట్టుబడ్డారు. దుబాయ్‌ నుంచి భారత్‌కు తరలిస్తుండగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ సుమారు రూ.18.6 కోట్లు. ఈ ఘటన గత నెల 25న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జకియా శనివారం తన పదవికి రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :