బీఆర్కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. గతంలో ఓ హత్యాయత్నం కేసులో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి మాజీ సీఎం ఎన్టీఆర్ ఇదే భవనంలో విచారణకు హాజరయ్యారు. కాగా కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో కేసీఆర్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే.