TG: సూర్యాపేట(D) చివ్వెంల(M) ఉండ్రుగొండలో అఘోరీ హల్‌చల్ చేసింది. శనివారం రాత్రి ఏపీలోని మంగళగిరి నుంచి వేములవాడకు వెళ్తూ మార్గమధ్యంలో ఉండ్రుగొండ గ్రామ శివారులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆర్చి వద్ద భోజనం చేసేందుకు ఆగింది. పలువురు ఆమెను ఫొటోలు తీస్తుండటంతో వారిపై దాడికి ప్రయత్నించింది. ఆదివారం ఉదయం ఖాసింపేట శివారులో టిఫిన్ చేయడానికి వెళ్లడంతో ఓ యువకుడు ఆమెను సెల్ఫీ అడగడంతో అతడిపై దాడికి దిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు.