ఏపీలో అఘోరీ కారుపై స్థానికులు దాడి

61చూసినవారు
ఏపీలో మహిళా అఘోరీ హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అఘోరీ కారుపై స్థానికులు దాడి చేశారు. రోడ్డుపై కారు నిలిపి బయటకు రాకుండా అఘోరీ పూజలు చేస్తూ కూర్చోంది. కారు నుండి బయటకు రావాలని పోలీసులు సూచించినప్పటికీ ఆమె కారు దిగలేదు. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో కొందరు యువకులు అఘోరీ కారుపై దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్