తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన లేడీ అఘోరీ (అలియాస్ శ్రీనివాస్) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మేరకు గతంలో చెప్పినట్లుగానే ఏపీకి చెందిన వర్షిణిని వివాహం చేసుకుంది. సోమవారం ఓ గుడిలో వేద మంత్రలా సాక్షిగా అఘోరీ, వర్షిణి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరీ తాళి కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.