ఈనెల 31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ

27చూసినవారు
ఈనెల 31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ
సికింద్రాబాద్‌ AOC సెంటర్‌లోని జోగిందర్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్‌, ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీ కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాక, వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్‌క్వార్టర్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్