TG: హైదరాబాద్‌లో UAEకి చెందిన ప్రముఖ కంపెనీలు శైవా గ్రూప్, తారానిస్ క్యాపిటల్ రూ.2,125 కోట్ల పెట్టుబడి పెట్టనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దీంతో 5,020 మందికి ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సచివాలయంలో ఈ రెండు సంస్థలు రాష్ట్రానికి చెందిన 5 సంస్థలతో తమ సమక్షంలో MoU కుదుర్చుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.