భారత్‌లో కృత్రిమ మేధ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 6 లక్షల మంది నిపుణులు ఉన్న ఈ రంగంలో, వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 12.5 లక్షలకు పెరుగనుందని BCG నివేదిక తెలిపింది. రేజర్‌పే, లెన్స్‌కార్ట్, నోబ్రోకర్ వంటి సంస్థలు ఇప్పటికే ఏఐను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఆధార్, యూపీఐ, స్టార్టప్‌ల వృద్ధితో పాటు కేంద్ర మద్దతు ఈ రంగ అభివృద్ధికి దోహదం చేస్తోంది. 2027 నాటికి ఏఐ మార్కెట్ భారీగా పెరగనుంది.