ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 200 ఎకరాల్లో ఈ ఏఐ సిటీని నిర్మించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఏఐ అంటేనే తెలంగాణ, హైదరాబాద్ గుర్తుకు వచ్చేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.