ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. విద్యాశాఖ సమీక్షలో మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాలపై ఖర్చుకు వెనకాడమని స్పష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న చోట 571 కొత్త పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.